విధి నిర్వహణలో అనారోగ్యంతో మృతి చెందిన కడప ఏఆర్ ఎస్‌ఐ దేవీప్రసాద్ కుటుంబానికి అదనపు ఎస్పీ తుషార్ డూడి కార్బస్ నిధి నుంచి వచ్చిన రూ.లక్ష నగదు ను అతని భార్య ప్రకాశమ్మకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దేవీప్రసాద్ మృతి పోలీసు శాఖకు బాధాకరమన్నారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఈ నగదును అందజేశామన్నారు. డీపీఓ జూనియర్ అసిస్టెంట్ నిరోషా, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa