రైతు సేవా సమితి వైయస్సార్ కడప జిల్లా తొలి మహాసభ మే 28వ తేదీ మైదుకూరు పట్టణంలో జరుగుతుందని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహాసభ సమాచార వివరాలతో కూడినటువంటి కరపత్రమును మైదుకూరు పట్టణంలోని ఎండిఓ కార్యాలయ ఆవరణలో రైతు సేవా సమితి సభ్యుల తో కలసి ఆయన విడుదల చేశారు. రాజకీయ పార్టీల కతీతంగా రైతు సంఘాలు ఎక్కడికక్కడ రైతులకు అవగాహన కల్పించి రైతుల పట్ల రాజకీయ పార్టీలు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
ఈ మహాసభకు చట్టాల పైన అవగాహన కలిగి నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి వి. వి లక్ష్మీ నారాయణ, జేడీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు. బొజ్జ దశరథ రామ్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది రైతు శ్రేయోభిలాషి. బొగ్గుల గుర్రప్ప నాయుడు, సీనియర్ కార్మిక నేత. వెన్నపూస సుబ్బి రెడ్డి, ప్రజాపక్షం కన్వీనర్. గోశెట్టి వెంకటరమణయ్య లు హాజరవుతున్నారు. కావున వైయస్సార్ కడప జిల్లా రైతులు రైతు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమ జయప్రదంలో తమ సహాయ సహకారాలు అందించి, 28వ తేదీ మైదుకూరు పట్టణంలో జరిగే ర్యాలీ అలాగే సభలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కోరారు.