ఏపీ సీఎం నేడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టును, రూ.194.40 కోట్లతో తారక రామ తీర్థ సాగరం ప్రాజెక్టు, రూ.23.73 కోట్లతో నిర్మిస్తున్న ఫిష్ ల్యాండిగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్, సిల్క్ వర్సిటీలకు శంకుస్థాపన చేస్తారు.