విద్యార్థులకు చదువుతోపాటు వారిలో నైపుణ్యాలను (ఇంటెన్‌షిప్) కూడా పెంపొందించేలా ప్రిన్సిపాల్స్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్స్ కృషిచేయాలని కళాశాల విద్యాశాఖ స్టేట్ కమిషనర్ పోలా భాస్కర్(ఐఏఎస్) అన్నారు. పెంటపాడు డీఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకినాడ, రాజమహేంద్రవరం, తణుకు, ఏలూరు నోడల్ రిసోర్స్ సెంటర్ పరిధిలోని ప్రభుత్వం, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్స్‌తో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాల లు అన్ని నేషనల్ ఎస్సెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(నేక్)గుర్తింపు పొందే విధంగా పనిచేయాలన్నారు. కళాశాల విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరక్టర్(రాజమండ్రి) డాక్టర్ పి.వి.కృష్ణాజీ, సీసీఈ డిప్యూటి డైరక్టర్ శంకర్ రావు, అకడమిక్ గైడెన్స్ అధికారి తులసీ మస్తానమ్మ, నేక్ ప్రత్యేకాధికారి కె.విజయ్‌బాబు, ఐటీ విభాగం ప్రత్యేక అధికారి కవిత, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.