నాయుడుపేట పట్టణ పరిధిలో కాలువలోపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు....శ్రీనివాసపురం కాలనీలో నివాసముంటున్న బద్రి,చెంచమ్మ దంపతులకు రెండేళ్ల క్రితం కుమారుడు చెంచయ్య పుట్టాడు. మంగళవారం బద్రి కూలి పనులకు వెళ్లడంతో చెంచమ్మ ఇంట్లో పనులు చేస్తుండగా చెంచయ్య ఆడుకుంటూ ఇంటి ముందర ఉన్న కాలువలో పడిపోయాడు. గమనించి తల్లి కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.