ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో యూనియన ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా సాంబశివ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు అందరికీ వాహనమిత్ర పథకం ద్వారా రూ.10వేలు ఇవ్వా లని, ఆటో డ్రైవర్లకు ఇబ్బందిగా ఉన్న జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ఆటో డ్రైవర్ల ను ఇబ్బంది పెట్టే ప్రైవేట్ ఫైనాన్స సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఉపసర్పంచ కేశవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప, ఏఐటీయూసీ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి నరసింహులు, ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన నాయకులు వెంకటేష్, సైదు, రెడ్డిమూర్తి, వెంకటనారా యణ, బాబ్‌జాన, బాలు, ఇర్ఫాన, షాకీర్, గౌస్ తదితరులు పాలొన్నారు.