సింహాద్రిపురం మండల పరిధిలోని కసునూరు గ్రామంలో బుధవారం ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ప్రత్యూష తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ 104 వాహనం ద్వారా నిర్వహించే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులను తీసుకెళ్లాలని వైద్యాధికారి చెప్పారు.