పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్తును ఆదా చేయడమే లక్ష్యంగా ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా మంత్రుల నుంచి సీఎం వరకు అందరికీ వర్తించనుంది. ఉదయం 9 నుంచి 5.30 వరకు బదులు.. 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. జులై 15 వరకు కొత్త టైమింగ్స్ అమల్లో ఉండనున్నాయి.