ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూడిమడకలో గడప గడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 03, 2023, 04:09 PM

అచ్చుతాపురం: సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకి తీసుకువచ్చారని ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు అన్నారు. డిసిసిబి మాజీ చైర్మన్ సుకుమార వర్మతో కలిసి బుధవారం పూడిమడక -2 సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలు అందని వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉండి పథకాలు రానివారు. ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేపల వెంకటరమణ, జడ్పీటీసీ లాలం రాంబాబు, ఎంపీపీ కోనబుజ్జి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com