కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన విశాఖ వాసులు కేదార్ నాథ్ లో మంచులో చిక్కుకున్నారు. ఈమేరకు బుధవారం ఉదయం తీవ్రంగా కురుస్తున్న మంచుతో శ్వాస అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. కేదార్ నాథ్ యాత్రంలో మొత్తం 150 మంది తెలుగువారు ఉన్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణంతో కేదార్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారని విశాఖ వాసులు అంటున్నారు. మంచు వర్షంతో తెలుగు యాత్రికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు. అధికారులు యాత్రికులను గుర్రాలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు.