పిడుగులు పడినప్పుడు, భయాందోళనకు గురైనా ఓ మంత్రం జపిస్తే ఉపశమనం కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ‘అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః’ మంత్రం జపించాలని అంటున్నారు. అర్జునుడు పూర్వ పాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగుల టైంలో అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేస్తే ధైర్యం వస్తుందంటున్నారు.