దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంకు వస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. అదానీ గ్రూప్ చైర్మన్‌తో కలిసి సీఎం వైయస్ జగన్ డేటా సెంటర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుందన్నారు. డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు వస్తోందని పేర్కొన్నారు. ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు సీఎం వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. డేటా సెంటర్‌లో విశాఖ ఏ1 సిటీగా మారనుందని చెప్పారు. డేటా సెంటర్‌తో ఇంటర్‌నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుందని, విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరంగా మారబోతుందని సీఎం వైయస్ జగన్ తెలిపారు.