అమరావతి ఆర్-5 జోన్ అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేరే జిల్లాల వారికి అమరావతిలోని ఆర్-5 జోన్లో భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కోసం జీవో 45 తీసుకొచ్చింది. దీనిని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.