తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని టిడిపి తూర్పు ఇంచార్జ్ నసీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచకాలపై రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయంలో కీలక పాత్ర పోషించే ప్రతి అంశాన్ని క్యాడర్ అందిపుచ్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.