సత్తెనపల్లి పట్టణంలోని 1, 4 వ సచివాలయాలను బుదవారం నాడు మునిసిపల్ కమిషనర్ షమ్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో బయోమెట్రిక్ వేసిమూమెంట్ రిజిస్టర్లో ఏ పని మీద బయటికి వెళ్ళారో లేకపోవడం వలన 4 వ సచివాలయం లోని ఇద్దరికి మెమోలు జారీ పిఎంఏజేవీ కింద ఈ కేవైసీ ను వాలంటీర్లు, సిబ్బంది ద్వారా త్వరగా పూర్తి చేయాలని ఎస్ డి జి సర్వే కింద 0 నుండి 5 సంవసరాల వయస్సు లోపు పిల్లలకు ఆధార్ అప్డేశన్స్ త్వరగా పూర్తి చేయాలనీ సెక్రటరీ లని బుధవారం ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే సమస్యలపై వాలంటీర్ సెక్రటరీ దాని సంభందిత అడ్మిన్ వెళ్లి సమస్యను సత్వరమే పరిష్కరించి వారి దగ్గర ఎండార్స్మెంట్ లో సైన్ చేసి తీసుకుని సమస్యను పరిష్కరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లోజ్ చేయాలన్నారు అంతేకాకుండా సమస్య పరిష్కారం కాకుండా వాటిని క్లోజ్ చేసినట్లు ఐతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీ ఓపెన్ కాకుండా మరలా వాటిని పరిష్కించాలన్నారు.