కుప్పం పట్టణంలోని పలు లాడ్జ్ లలో బుధవారం కుప్పం అర్బన్ ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా లాడ్జ్ లలో తనిఖీలు చేశామని ఎస్సై శివకుమార్ వివరించారు. కర్నాటక ఆంధ్ర బార్డర్ లో కుప్పం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేసి లాడ్జ్ యజమానులకు తగు సూచనలు చేశామని శివకుమార్ పేర్కొన్నారు.