కడప జిల్లా సిద్ధవటం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయించిన గ్రామ కమిటీలను రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా బత్యాల చెంగల రాయుడు బుధవారం ఆమోదిస్తూ రెండు కమిటీల నూతన అధ్యక్షులను మరియు మైనార్టీ విభాగం వారిని శాలువాలలు వేసి పూలమాలతో ఘనంగా సత్కరించారు.సిద్ధవటం మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యుల ప్రతి ఒక్కరు కలిసి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని. , పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా, పార్టీకి వ్యతిరే కార్యక్రమాలు చేపడితే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.