రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన చిట్వేలిలో వైభవంగా గంగమ్మను ఊరేగిస్తున్నారు. తెల్లవారుజామున ప్రత్యేకంగా తయారు చేసిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రధాన రహదారిలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి వేప మండలతో ప్రత్యేకంగా తయారు చేసిన గుడిలో నిలిపారు. ప్రధాన రహదారిలో భక్తులు ముద్దలు పెట్టి, బలులు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. గంగమ్మ తల్లిని దర్శించి ఆశీర్వాదాలు పొందడానికి వందలాది మంది భక్తులు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్వేలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.