ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు దోచుకు పోయిన ఘటన పెదకాకానిలో చోటుచేసుకుంది. పెదకాకాని కాలనీకి చెందిన మోహన్ దంపతులు మంగళవారం రాత్రి తలుపులకు గడియ వేయకుండా నిద్రపోయారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బుధవారం ఉదయం ఇంట్లోకి కొత్త వ్యక్తులు వచ్చినట్లు గుర్తించిన ఆ దంపతులు బంగారాభరణాలు చోరీ అయ్యారని తెలుసుకున్నారు. బుధవారం బాధితులు పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బండారు సురేష్ బాబు తెలిపారు.