పెదకాకాని గ్రామానికి చెందిన షేక్ బాబు అదే గ్రామానికి చెందిన వంశీ వద్ద వారాల లెక్క ప్రకారం చెల్లించే విధంగా 5వేలు రూపాయలు బాకీ తీసుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీన షేక్ బాబు అతని భార్య ఊరికి వెళ్లేందుకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఉండగా వంశీ , షేక్ నాగూర్ బీ బస్టాండ్ కు వెళ్లి ఇద్దర్నీ ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్తావు బాకీ కట్టకుండా అని తిట్టడంతో పాటు ఇనుప రాడ్లతో కాళ్లు చేతులు మీద కొట్టగా తీవ్రంగా గాయాలైన బాబు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది అనంతరం గురువారం పెదకాకాని పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశాడు. షేక్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.