కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లి మండలంలో చినపూరిగా ప్రసిద్ధిగాంచిన వడాలిలోని సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయ. ఆలయ అర్చకులు స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. ఈవో సింగనపల్లి శ్రీనివాసరావు, చైర్ పర్సన్ మర్రివాడ సుబ్బలక్ష్మి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.