గుంటూరు నగర పాలక సంస్థ 16వ డివిజన్ ఏటుకూరు గ్రామ ప్రజలు గురువారం మేయర్ కావటి శివ మనోహర్ నాయుడు ను సంపత్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాడిశెట్టి మహాలక్ష్మమ్మ గార్లపాటి రంగమ్మ ధర్మసత్రానికి సంబంధించిన సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని కోరారు. స్పందించిన మేయర్ సత్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.