తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని సురుటపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే నిత్య అన్నదానానికి చెన్నై అన్నా నగర్ కు చెందిన వ్యాపారవేత్త గంగవరాజన్ రు. 1, 00, 116చెక్కును ఈవో రామచంద్రారెడ్డి, పాలకమండలి సభ్యుల సమక్షంలో బుధవారం విరాళం అందజేశారు. ఈవో మాట్లాడుతూ నిత్య అన్నదానానికి ఇచ్చే విరాళాలకు ఆదాయం పన్ను మినహాయింపు ఉందన్నారు. పాలక మండల సభ్యులు ఆనంద్, మునివేలు, మంజుల ఉమాపతి పాల్గొన్నారు.