సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెంలో గ్రామదేవత రావలమ్మ అమ్మవారి పండగ కనులు పండుగగా జరిగింది. బుధవారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ ప్రకారం అమ్మవారి ఘటాలను తిరు వీధులలో ఉఉరేగుంపు కార్యక్రమం నిర్వహించి వైభవంగా అనుపు మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విచిత్ర వేషధారణలు, గంగిరెద్దుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి.