విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను పెందుర్తి పోలీసులు బుదవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా వీరిద్దరితో కలిపి ఎనిమిది మంది అరెస్టయ్యారు. తాజాగా కిడ్నీ శస్త్ర చికిత్స చేసిన వైద్య నిపుణుడు రాజశేఖర్ పెరుమాళ్ళ, మధ్యవర్తి వెంకటేష్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.