జీవీఎంసీ క్లాప్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం సాయంత్రం 52వ వార్డు, మర్రిపాలెం వుడాలేఅవుట్లో ఉన్న ప్రాంతీయ భవిష్యనిధి(ఫిఎఫ్) కార్యాలయం ఎదుట క్లాప్ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ జీవో నెం-7 ప్రకారం 18, 500 రూపాయలు కనీస వేతనం ప్రతి నెల గుత్తేదారు ఇవ్వడం లేదని, పీ. ఎఫ్, ఈయస్ఐలు కట్టలేదని ఆరోపించారు. తక్షణమే క్లాప్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొవాలని లేదంటే త్వరలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. భవిష్యనిధి ఉన్నతాధికారులకు తమ సమస్య పై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 జోన్లకు చెందిన క్లాప్ కార్మికులు పాల్గొన్నారు.