ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే ధ్యేయంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపిఎంఎస్ఎంఇడిసి చైర్మన్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 90 వ వార్డు అధ్యక్షులు చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయం 1086474 పరిధి వినోద్ నగర్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొని 250 గృహాలకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే అవి ఏవిధంగా అందించాలో వలం టీర్లు, సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు నమ్మి వెంకటకృష్ణ మూర్తి యాదవ్ (నమ్మి శ్రీను) , నగర ప్రధాన కార్యదర్శి ఎల్లపు వెంకటేశ్వరరావు , సేవాదళ్ అధ్యక్షుడు బోర అప్పల రెడ్డి, ఎన్ సూరిబాబు , ప్రచార కమిటీ అధ్యక్షులు రామకృష్ణ , యుగంటేశ్వరరావు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది , ఆర్పీలు, వాలంటీర్లు , మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.