రణస్థలం మండలానికి మొదటి విడతగా 23, 594 ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు వచ్చాయని ఎంఈవో ఎ. త్రినాథరావు చెప్పారు. మండల కేంద్రానికి చేరిన పుస్తకాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు రాగిజావ తాగేందుకు 8, 700 గ్లాసులు కూడా మండలానికి చేరినట్టు పేర్కొన్నారు. మండలంలో ఉన్న 81 ప్రాథమిక, పది ఎంపీయూపీ, 15 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, ఒక కేజీబీవీ, అదర్శ పాఠశాలు ఉన్నాయన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 2023 -24 సంబంధించి పుస్తకాలను వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తెరుచుకోగానే పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఐఎస్ విజయ్, సీఆర్పీ శ్రీనివాస్ ఉన్నారు.