రణస్థలం: అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకులుగా ఎంపికైన వారికి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నియామకపత్రాలను అందజేశారు. లావేరు మండలం బెజ్జిపురం-1 కేంద్రం సహాయకురాలుగా దాసరి ఆదిలక్ష్మి, జి. సిగడాం మండలం దేవరవలస పంచాయతీ ముంగంపేట కేంద్రం సహాయకురాలు సీహెచ్ మంగమ్మలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు సక్రమంగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవోలు ఝాన్సీ, డి. పాపినాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు తిరుమరెడ్డి లక్ష్మణరావు, చివికి అసిరప్పడు, కిల్లారి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.