ప్రకృతి సేంద్రియ వ్యవసాయం తోనే నేడు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పోలాకి మండలం గొల్లలవలస గ్రామపంచాయతీ తోటాడ గ్రామంలో యూనిట్ ఇన్చార్జి బి సీతారామయ్య తెలిపారు. గురువారం స్థానిక గ్రామంలో కేఏపీ సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా నవధాన్యాల వినియోగం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో రైతులకు అవగాహన పరిచారు. భవిష్యత్తులో సేంద్రీయ వ్యవసాయమే ఆధారం అవుతుందని వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీని గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐ సి ఆర్ పి ధనలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.