బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి, మూల్పూరు, కూచిపూడి, యడవూరు గ్రామాల్లోని జొన్న, మొక్కజొన్న పంటపొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నేడు పర్యవేక్షించనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి, వి. లోకేశ్వరి గురువారం తెలిపారు. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జొన్న మొక్కజొన్న పంటలు వర్షాల ప్రభావంతో తడిసిన క్రమంలో వాటిని పరిశీలించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గం. లకు, జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్ సత్తార్, డిడిఏ, విజయనిర్మల, ఏడిఏ, లక్ష్మి పంట పొలాలు పరిశీలించనున్నట్లు ఏ. వో, తెలిపారు.