గరుగుబిల్లి మండలంలోని అభివృద్ధికి నోచుకోని చెరువులను ఉపాధి హామీ పథకం ద్వారా పనులు ప్రారంభించామని డ్వామా పిడి రామచంద్రరావు బుధవారం తెలిపారు. మన గ్రామం మన చెరువు కార్యక్రమంలో చెరువుల అభివృద్ధి చేపడుతామన్నారు. మండలంలోని బీవీ పురం మంచినీటి కోనేరు, సీతారాంపురం ధర్మకోనేరు, గొట్టివలస శివాలయం కోనేరు, గరుగుబిల్లి సంత కోనేరు చెరువులను ఎంపిక చేసామని అన్నారు. వర్షాకాలానికి పూర్తి అయ్యేలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు