మణిపూర్లో గిరిజనుల ఆందోళన వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మీటీ కమ్యూనిటీ ప్రజలు ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో హింస చలరేగింది. నిరసన కారులకు మరో వర్గంతో గొడవ జరిగింది. మరికొందరు ఇళ్లకు నిప్పంటించారు. దీంతో అధికారులు మణిపూర్ అంతటా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు.