జామి మండలo భీమిసింగిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. జామి ఎస్సి కాలనీకి చెందిన బోణీ సందీప్ ద్విచక్ర వాహనంపై జామి నుంచి విజయనగరం వెళ్తున్న సమయంలో భీమసింగి జియో ఆఫీసు వద్ద ఈశ్వరరావు అనే వ్యక్తి అడ్డుగా రావటంతో బైక్ నియంత్రించే ప్రయత్నంలో బైక్ మీద నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఈశ్వరరావు ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.