తిరుమలలో బుధవారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం, నాలుగు మడ వీధులు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో వర్షంతో పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైకుంఠం క్యూ లైన్లలో భక్తులు వర్షంలో తడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం టిటిడి ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకున్నారు. రోడ్లు అంత జలమయమయ్యాయి.