తిరుపతి జిల్లాలో ఏడుగురు తహసీల్దార్లను బదిలీ చేశారు. వారిలో ప్రధానంగా చిన్నగొట్టిగల్లు తహసీల్దార్ బి. హనుమాన్ నాయక్‌ను బీఎన్ కండ్రిగ, అక్కడ పనిచేస్తున్న టీవీ సుబ్రమణ్యాన్ని తిరుపతి రూరల్, ఇక్కడ నుంచి ఎం. లోకేశ్వరిని చిన్నగొట్టిగల్లుకు బదిలీ చేశారు. అలాగే కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న పరమేశ్వరస్వామి, తహసీల్దార్ నిత్యానందబాబును సివిల్ సప్లయి తనిఖీ అధికారులుగా నియమించారు.