రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా నగరి నియోజవర్గంలో.. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 13. 60 లక్షలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నగరిలోని మంత్రి కార్యాలయంలో గురువారం పంపిణీ చేశారు. నగరి మున్సిపాలిటీకి చెందిన బాబు రెడ్డి, గోపీనాథ్, నాగమ్మ అనే వారికి, పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన సురేష్ బాబు, విజయపురం మండలం కోసలనగరం గ్రామానికి చెందిన చాందిని కి మొత్తం ఐదు మంది బాధిత కుటుంబాలకు 13. 60 లక్షలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన బాధిత కుటుంబాలు మంత్రి ఆర్. కె. రోజాకి కృతజ్ఞతలు తెలియజేశారు.