నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలంలోని కనుపర్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యనేతగా మంత్రి కాకాని పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీసే సమయం ఆసన్నమైందన్నారు. తొలుత గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీవో నగేష్‌కుమారి, తహసీల్దారు ప్రసాద్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.