గుంటూరు జిల్లాలో శుక్రవారం నుండి మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఒక క్వింటాకి రూ. 1962 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో మొక్కజొన్నలు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఈనెల 12వ తేదీ లోగా తమ పేర్లు నమోదు చేసుకుని మద్దతు ధర పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.