నరసరావుపేట పట్టణంటీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో డ్రగ్స్, గంజాయి మాఫియా రెచ్చిపోతుందని అన్నారు. అల్లూరివారిపాలెంలో జేమ్స్ అనే వ్యక్తిని వైసీపీ కార్యకర్తలు చిత్రహింసలు చేసి చంపారని ఆరోపించారు.