ఆటో బోల్తా పడి ఆరుగురు గాయపడ్డ సంఘటనగురువారం ములకలచెరువు మండలంలో జరిగింది. ఎస్సై మధు రాముడి కథనం. బి. కొత్తకోట నుంచి పిటిఎం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో ఐదుగురు ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్ రమణప్ప గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ రవణప్పను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.