పాక్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8 మంది ఉపాధ్యాయులు మృతిచెందారు. అప్పర్ కుర్రమ్ జిల్లా పరాచినార్ లోని ప్రభుత్వ పాఠశాల టీచర్ మహ్మద్ షరీఫ్ ను గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపాడు. ఆయన సున్నీ మెంగల్ తెగకు చెందిన వాడు కావడంతో మెంగల్ వర్గీయులు ప్రభుత్వ తెరి మెంగల్ హైస్కూల్ లోకి చొరబడి షియా తెగకు చెందిన ఏడుగురు టీచర్లను కాల్చిచంపారు.