అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్రచికిత్సకు నాంది పలికారు. శిశువు తల్లి గర్భంలో ఉండగానే మెదడులో అరుదుగా వచ్చే వాస్కులర్ వైకల్యానికి సర్జరీ చేసి తల్లీబిడ్డలను రక్షించారు. ప్రస్తుతం ఈ వ్యాధికి శిశువు పుట్టాక సర్జరీ చేస్తున్నారు. కొంచెం ఆలస్యమైనా శిశువు చనిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్న బోస్టన్ వైద్యులు 34 వారాల పిండానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.