రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇరు దేశాల రాజకీయ నేతలు, ప్రజల్లో శత్రుత్వం పేరుకుపోయింది. గురువారం ఓ గ్లోబల్ సమావేశంలో రష్యా ప్రతినిధిని ఉక్రెయిన్ ఎంపీ కొట్టారు. ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవ్స్కీ జాతీయ జెండా పట్టుకుని ఉండగా, రష్యా ప్రతినిధి లాగేసి చించడంతో గొడవ ప్రారంభమైంది. ఉక్రెయిన్ ఎంపీ రష్యా ప్రతినిధిపై పిడిగుద్దులు గుద్దడం వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.