గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) మీటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. చేతులు జోడించి నమస్కరిస్తూ పాక్ మంత్రికి వెల్ కం చెప్పగా, బిలావల్ జైశంకర్ కు నమస్కరిస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత పాక్ మంత్రి ఇండియాలో పర్యటిస్తుండగా, ద్వైపాక్షిక చర్చలపై స్పష్టత లేదు.