పెళ్లి వేడుకలోనే వధూవరులు చితక్కొట్టుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. షాహ్గంజ్ పరిధిలో వధూవరులకు వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు, వరుడు మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. ఇది కాస్త కొట్టుకునే దాక వెళ్లింది. దీంతో ఇరు కుటుంబికులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.