ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్ బటర్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో 12,132 మంది ఖాతాల్లో రూ.87.32 కోట్లు జమ అయ్యాయి. కాగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ. లక్ష, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు, కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.40 వేలు, బీసీల్లో కులాంతర వివాహాలకు రూ.75 వేలు, దివ్యాంగులకు రూ. 1.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే.