రాజస్థాన్ జైపూర్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ బ్యాంకులో చొరబడ్డ దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.5 లక్షలు దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలుగా వీడి గాలిస్తున్నారు.