మేడికొండూరు మండల ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మేడికొండూరు తహసిల్దార్ కరుణకుమార్ అన్నారు. మండల పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయం నుండి వచ్చే అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తహసిల్దార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.