తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దర్శించుకున్నారు. వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.